కార్యాలయంలోనే తహసీల్దార్‌ రాసలీలలు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 7:39 AM GMT
కార్యాలయంలోనే తహసీల్దార్‌ రాసలీలలు..

ఉన్నత పదవిలో ఉన్న అధికారి.. తన కార్యాలయంలో తన కింద పని చేసే సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన అధికారి ఏకంగా కార్యాలయంలోనే తోటి మహిళా ఉద్యోగినితో రాసలీలలు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో బయటకు రావడంతో.. సదరు అధికారి బాగోతం బయటకు వచ్చింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం కొప్పళ నగరాభివృద్ది ప్రాధికార కార్యాలయంలో తహసీల్దార్‌గా గురుబసవరాజు పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడు కుష్టిగి తహసీల్దార్‌గా పని చేస్తున్న సమయంలో ఆఫీసులోనే ఓ మహిళా ఉద్యోగికి ఏకంగా ముద్దు పెట్టాడు. ఈ ఘటన అక్కడికి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Next Story
Share it