తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి  కేటీఆర్‌లపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ పశువులకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి వాళ్లను కాల్చి చంపినా తప్పలేదని వ్యాఖ్యనించారు. యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌ ప్రజలు మెజార్టీ ఇచ్చారని, కానీ దొడ్డిదారిన టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. వరంగల్‌ కడియం శ్రీహరితో ఎక్స్‌ ఆఫిషియా ద్వారా ఓటు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే అక్రమ భూ దందాలు చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ కూతురు కవిత తుర్కపల్లిలో అక్రమంగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని, ఇందుకు సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయని కోమటిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్టకు కేసీఆర్‌ 12సార్లు వచ్చినా.. ఇక్కడి పేద ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. యాదగిరిగుట్ట సీఐ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.