కొల్లు రవీంద్ర దీక్షను అడ్డుకోవడం అరాచకం: చంద్రబాబు
By Medi Samrat Published on 11 Oct 2019 7:08 PM ISTఅమరావతి : ప్రభుత్వం కావాలనే ఇసుక కొరత సృష్టించి పేదల పొట్ట కొడుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న 36 గంటల దీక్షను అడ్డుకోవడం దారుణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రజాందోళనలు అణిచివేయడంపై పెట్టే శ్రద్ధలో పదో వంతు పేదల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే బాగుంటుందని చంద్రబాబు అన్నారు. విశాఖలో మా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణలపై అక్రమ కేసులు పెట్టారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అక్రమ కేసులు పెడితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని చంద్రబాబు సూచించారు.
�
Next Story