జూనియర్‌ ట్రంప్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 1:10 PM GMT
జూనియర్‌ ట్రంప్‌ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ గర్ల్‌ఫ్రెండ్‌ కింబర్లీ గుయిల్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అమెరికా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఫాక్స్‌ న్యూస్‌లో పనిచేసిన 51ఏళ్ల కింబర్లీ ప్రస్తుతం ట్రంప్‌ ప్రచార టీమ్‌ సీనియర్‌‌ ఫండ్‌ రైజర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ దగ్గర పనిచేసే వారిలో వైరస్‌ బారిన పడిన మొదటి వ్యక్తి ఈమె. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా పాజిటివ్‌ వచ్చిందని వైట్‌హౌస్‌ వర్గాలు చెప్పాయి.

వాస్తవానికి శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి దక్షిణ డకోటాలో ఎన్నికల సభలో పాల్గొనాల్సి ఉండగా.. పాజిటివ్‌ రావడంతో ఆమె వెళ్లలేదు. పాజిటివ్‌గా తేలడంతో ఆమె ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో ఆమె ట్రంప్‌తో కానీ, జూనియర్‌‌ ట్రంప్‌తో కానీ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదని సమాచారం. అలాగే జూనియర్‌ ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

అమెరికాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు అమెరికాలోనే నమోదు అయ్యాయి. గత రెండు రోజులుగా 50వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటి వరకు అక్కడ 28లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1.32లక్షల మంది మృత్యువాత పడ్డారు.

Next Story
Share it