హైదరాబాద్‌: పంజాగుట్టలోని నాగార్జున హిల్స్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన రియసత్‌ అలీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం తొటి ఆటో డ్రైవర్‌ అన్వర్‌ అలీతో విభేదాలు ఏర్పడి గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో అన్వర్‌ అలీని హత్య చేసి రియసత్‌ అలీ జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై ఐదు రోజల కిందట రియసత్‌ అలీ విడుదలయ్యాడు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో టీ తాగడం కోసం షాపుకు వస్తున్నా రియసత్‌ అలీని పథకం ప్రకారం చంపారు. రియసత్‌ను ఐదుగురు దుండగులు కత్తులతో పొడిచి చంపినట్టుగా పోలీసులు తెలిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రియసత్‌ అలీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. రియసత్‌ అలీ గత నెల ఆటో డ్రైవర్‌ అన్వర్‌ హత్య కేసులో ఎ1 ముద్దాయిగా ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.