ఆ కిడ్నీ బరువు 7.4కిలోగ్రాములు..!

By Newsmeter.Network  Published on  26 Nov 2019 7:30 AM GMT
ఆ కిడ్నీ బరువు 7.4కిలోగ్రాములు..!

ఢిల్లీ : గంగారం ఆస్పత్రి వైద్యులు ఇటీవల ఒక రోగి నుంచి 7.4 కిలోల బరువున్న మూత్రపిండాన్ని తొలిగించారు. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా, అతి బరువైనదిగా వైద్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటిదాకా 4.25 కిలోల బరువున్న కిడ్నీని ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్నారనీ, ఇప్పుడు తాము తొలగించిన 7.4 కిలోల మూత్రపిండమే అత్యంత పెద్దదని వైద్యులు తెలిపారు.

Kidney Copy

అయితే కడుపు నొప్పి ఇతరత్రా ఇబ్బందులతో తమ వద్దకు వచ్చిన రోగికి పలు పరీక్షలు చేశామని, ముందుగా జరిపిన స్కానింగ్‌లలో భారీ స్థాయి కిడ్నీ ఉందని తేలిందని, అయితే ఇది ప్రపంచ అత్యధిక బరువు కిడ్నీ అని తాము అప్పుడు అనుకోలేదని డాక్టర్ సచిన్ చెప్పారు. ఈ కిడ్నీని ప్రపంచ గిన్నీస్ రికార్డులకు పంపించాలని గంగారాం ఆస్పత్రి వైద్యులు భావిస్తున్నారు. ఇటువంటి భారీస్థాయి ఆపరేషన్‌ను కూడా ప్రపంచ రికార్డులలో చేర్చాలని వారు కోరనున్నారు.

Next Story