'కేజీఎఫ్- 2' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
By అంజి Published on 15 Dec 2019 8:07 AM ISTకన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 1. ఈ సినిమా సంచలన విజయం సాధించిదని తెలిసిందే. కన్నడతో పాటు పలు ఇతర భాషాల్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అద్భుత విజయాన్ని అందించారు.
దీంతో ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'కేజీఎఫ్- 2' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రేక్షకుల్లో ఏర్పడిన భారీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ఇకపోతే ఈ 'కేజీఎఫ్- 2' సినిమా ఫస్ట్ లుక్ ని ఈనెల 21వ తేదీ సాయంత్రం గం. 5.45 ని.లకు రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలియచేసింది.
యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అధీర అనే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ పై అత్యంత భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి... ఫస్ట్ పార్ట్ వలే కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూద్దాం.