ఇక్కడ 'ఉల్లి' ఉచితం

By సుభాష్  Published on  19 Dec 2019 11:13 AM GMT
ఇక్కడ ఉల్లి ఉచితం

నిత్యావసర వస్తువు అయిన ఉల్లి అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర దాదాపు రూ. 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో పెళ్లిళ్ల సీజనులో వస్త్రాలు కొనే వారికి ఉచితంగా ఉల్లిగడ్డలను ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు ఓ వ్యాపారి. మహారాష్ట్రలో ప్రేంరాజ్‌పాల్ అనే బట్టల వ్యాపారి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. థానే నగరంలోని ఉల్లాస్ నగర్ పట్టణానికి మరో వ్యాపారి కూడా ఈ ఉల్లిగడ్డల ఆఫర్ ఇచ్చారు. తన వస్త్ర దుకాణంలో వెయ్యిరూపాయల విలువ గల వస్త్రాలు కొనుగోలు చేస్తే కిలో ఉల్లిగడ్డలను ఉచితంగా ఇస్తానని ప్రేంరాజ్‌పాల్‌ ప్రకటించారు. ఉద్గిరి పట్టణానికి చెందిన ఈ వస్త్రవ్యాపారి క్వింటాల్ ఉల్లిగడ్డలు కొనుగోలు చేశారు. పదివేల రూపాయల వస్త్రాలు కొన్న వారికి 15 కిలోల ఉల్లిగడ్డలను ఉచితంగా ఇస్తామని చెప్పి షాపు ముందు పెద్ద బ్యానరే కట్టేశాడు. ఇలా వెయ్యి రూపాయల వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు ఉచితంగా ఇస్తానని తెగ ప్రచారం చేసుకుంటున్నాడు ఈ వ్యాపారి. పెళ్లిళ్ల సీజన్ కావడంతోపాటు ఉల్లిగడ్డల బంపర్ ఆఫరు ప్రకటించడంతో ప్రేంరాజ్‌పాల్ వ్యాపారం ఊపందుకుంది.

Kg Onion Free1

కొందరు ఓ మోబైల్‌ షాపు యజమాని కూడా ఇలా బంపర్‌ ఆఫర్‌ ఇస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఓ స్మార్ట్ ఫోన్ కొనేవారికి కిలో ఉల్లిగడ్డలను కూడా ఉచితంగా ఇస్తూ బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. వ్యాపారులే కాదు పూణే నగరంలోని రేడియో మిర్చి కూడా మూవీ మసాలా పేరిట వారం వారం పోటీ నిర్వహించి విజేతలకు 5 కిలోల ఉల్లిగడ్డలను బహుమతిగా ఇస్తోంది.

దేశంలో ప్రస్తుతం ఉల్లి కొనకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. దేశంలో ఇలా ఉల్లిధర అమాంతం పెరిగడం రెండోసారి. 2013లో ఇదే గతి పట్టింది.ఇప్పుడు ఏకంగా కిలో ఉల్లి ధర 150కిపైగా వరకు పలుకుతోంది. ఉల్లిని పండించే రాష్ట్రాల్లో అధిక వర్షం కారణంగా దిగుబడి రాకపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. మధ్య దళారుల కారణంగా కూడా ఇలా ధర అకాశన్నంటే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 25 విక్రయిస్తున్నారు. ఉల్లి రాష్ట్రంలో అందుబాటులో లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఏపీలో ఇలా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

Next Story