ఏప్రిల్‌ 2వరకు కీలక దశ.. కరోనాపై బాల జ్యోతీష్యుడు ఏం చెప్పాడంటే..?

By Newsmeter.Network  Published on  30 March 2020 2:10 PM IST
ఏప్రిల్‌ 2వరకు కీలక దశ.. కరోనాపై బాల జ్యోతీష్యుడు ఏం చెప్పాడంటే..?

ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తుంది. దీంతో ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా కరోనా అనే పదమే వినిపిస్తుంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇటలీ, చైనా, బ్రిటన్‌ లాంటి దేశాలు ఈ వైరస్‌ తో కుదేలయ్యాయి. మిగిలిన దేశాల పరిస్థితి అంతే ఉంది. భారత్‌లోనూ ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఇప్పటికే దేశంలో 1050కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 29 మంది మృతి చెందారు. కాగా మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 2వరకు చాలా కీలకమైన దశ అని, ఈ దశలో ఎంత అప్రమత్తంగా ఉంటే కరోనా భారి నుంచి అంత వేగంగా బయటపడతామని ఓ బాల జ్యోతిష్యుడు స్పష్టం చేస్తున్నాడు. జ్యోతిష్యుడు చెబితే నమ్మటమేంటి.. అందులోనూ బాల జ్యోతిష్యుడు చెబితే ఎలా నమ్ముతాం అని అందరూ అనుకోవచ్చు.

Also Read :ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

ఈ బాల జ్యోతీష్యుడు పేరు అభిజ్ఞా ఆనంద్‌. ఓ రుషిలా కనిపించే ఆయన వేదాలు చదివేశాడు. పలు భాషల్లో ప్రావీణ్యం పొందాడు. అంతేనా చిన్న వయస్సులోనే ఎంతో తెలిసినట్లుగా అన్నీ చెప్పేస్తున్నాడు. భవిష్యత్తు కూడా చెబుతాడు. గత ఏడాది ఆగస్టు22న ఓ యూట్యూబ్‌ వీడియోలో 2020లో ప్రపంచంలో ఓ బయలాజికల్‌ వార్‌ జరుగుతుందని అందులో ప్రధానంగా చైనా సఫర్‌ అవుతుందని చెప్పాడు. రవాణా స్తంభించిపోయి జనం ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండిపోతారని చెప్పారంట. ప్రస్తుతం ఆ బాల జ్యోతీష్యుడు చెప్పినట్లే జరుగుతుండటంతో అందరి చూపు అతనిపై పడింది.

Also Read :ఎనిమిది నెలల గర్భిణి 100కి.మీ నడక.. చివరికి..

ఇప్పుడు అదే బాల జ్యోతీష్యుడు ఓ యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ప్రభావం మే 29 నాటికి తగ్గుముఖం పడుతుందని తెలిపాడు. కాకపోతే మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 2 చాలా కీలకమైన దశ అని, లోకానికి విషమ పరీక్ష అని తెలిపాడు. లోకానికి విషమపరీక్ష రెండు నెలలపాటు కొనసాగిందని, మార్చి 29 వరకూ పీడించి ఆ తరువాత డైల్యూట్‌ అయిపోయి ఆ పీడ నుంచి మన గ్రహం ఏప్రిల్‌ 2న వీడుతుందని అన్నారు. ఇక మే 29 తరువాత పరిస్థితులు అదుపులోకి వస్తాయని, అప్పటి వరకు ఇబ్బందులు తప్పవని ఆ వీడియోలో ఈ బాలజ్యోతీష్యుడు తెలిపాడు. దీంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నా.. మార్చి 31, ఏప్రిల్‌ 2 వరకు కీలక దశ అని బాల జ్యోతీష్యుడు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. మరి చూద్దా ఈసారి కూడా బాల జ్యోతీష్యుడు చెప్పినట్లు (కరోనా మహమ్మారి) ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న పీడ కొంతమేరైనా తగ్గుముఖం పడుతుందో లేదో.

Also Read :ఇద్దరు భార్యలు… లాక్ డౌన్‌తో ఒకే చోట కాపురం.. కోడికూర వండి భ‌ర్త కోసం ఎదురుచూస్తుండ‌గా..

Next Story