ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 4:52 PM ISTఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం అయ్యింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. త్వరలో ప్రారంభించే వివిధ పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
జనవరి 26 నుంచి 'అమ్మ ఒడి' పథకం అమలు చేయాలని సీఎం జగన్ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి జగ్గయ్యపేటలో గత ప్రభుత్వం కేటాయించిన 498 ఎకరాల భూకేటాయింపులు రద్దు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖలో లులు గ్రూప్‌కు కేటాయించిన రూ.1,500 కోట్ల విలువైన 13.83 ఎకరాల భూమిని రద్దు చేస్తున్నట్టు మంత్రివర్గం నిర్ణయించింది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హజ్, జెరూసలెం యాత్రుకులకు ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ల్యాబ్లో పరీక్షించి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.