వంశీది టీడీపీ 'డీఎన్ఏ'.. వదులుకోవడానికి సిద్దంగా లేం.!
By Medi Samrat Published on 28 Oct 2019 6:23 PM ISTఅమరావతి : ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ రాజీనామాతో ఒక్కసారిగా అమరావతి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. వంశీ రాజీనామా లేఖ అందుకున్న చంద్రబాబు.. ఆయన్ను బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగంలోకి దింపారు.
చంద్రబాబు ఆజ్ఞ మేరకు వంశీని బుజ్జగించే బాధ్యతను తీసుకున్న కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీని వదులుకొనేందుకు టీడీపీ సిద్ధంగా లేదని.. వంశీతో మాట్లాడేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానన్నారు. వంశీ లాంటి రాజకీయ నేత రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది కాదని.. వంశీ తరఫున పోరాడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండకూడదని హితువు పలికారు. వంశీది టీడీపీ డీఎన్ఏ అనీ.. ఆయ చేసిన పోరాటాలు పార్టీ గుర్తుపెట్టుకుంటుందన్నారు.