ఇంట్లో ఉండండి.. నాలుగు గ్రాముల బంగారం గెలుచుకోండి
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. అయినప్పటికి కొందరు లాక్‌డౌన్ నియమాలను ఉల్లంగిస్తున్నారు.
ఇక లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు ఓ వినూత్న ఆలోచనల చేశారు. ఎవరైతే.. లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉన్న కుటుంబాలకు బహుమతులు అందిస్తామని ప్రకటించారు. మొదటి బహుమతిగా నాలుగు గ్రాముల బంగారం అందినున్నారు. అయితే.. ఇది మన రాష్ట్రంలో కాదులెండి. కేరళ రాష్ట్రంలో.
కేరళలోని మలప్పురం జిల్లాలోని తాజెక్కోడ్ గ్రామ పంచాయతీ దే ఈ ఆలోచన. గ్రామస్తులు లాక్‌డౌన్ రూల్ ను ఉల్లగించకుండా ఉండేందుకు అక్కడి అధికారులు ఈ ఆలోచన చేశారు. తొలి బహుమతిగా నాలుగు గ్రాముల బంగారం, రెండో బహుమతిగా రిఫ్రిజిరేటర్, మూడో బహుమతిగా వాషింగ్ మెషిన్ అందించనున్నారు. వీటితో పాటు మరో 50 మందికి కాంప్లీమెంటరీ బహుమతులు ఇవ్వనున్నరు. మే 3 తరువాత లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని గ్రామ అధికారులు చెప్పారు.