ఏనుగు మృతిపై సంచలన ప్రకటన.. నిందితుల ఆచూకీ చెబితే రూ.50వేలు

By సుభాష్  Published on  4 Jun 2020 8:19 AM GMT
ఏనుగు మృతిపై సంచలన ప్రకటన.. నిందితుల ఆచూకీ చెబితే రూ.50వేలు

కేరళలోని మలప్పురంలో స్థానికులు పేలుడు పదార్థాలతో నిండిన ఫైనాపిల్‌ను ఏనుగుకు తినిపించగా, అది పేలి తీవ్ర రక్రస్రావంతో నదిలోకి వెళ్లి మృతి చెందింది. అంతేకాదు ఏనుగుతో సహా దాని కడుపులో పెరుగుతున్నబిడ్డ సైతం మృతి చెందడానికి కారణమయ్యారు ఆ దుర్మార్గులు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షస్తామని ప్రకటించారు.

కాగా, మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయే ఈ సంఘటనపై హ్యుమన్‌ సొసైటీ ఇంటర్నేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా స్పందించింది. ఏనుగు ప్రాణాలు తీసిన నిందితుల ఆచూకీ చెబితే రూ. 50 వేల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నిందితులను వదిలిపెట్టవదని తెలిపింది.

అలాగే, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా స్పందించారు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేశారు. గర్బిణీ ఏనుగు మృతిపై ఆయన తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన ఏనుగుకు న్యాయం చేయాలని రతన్‌టాటా డిమాండ్‌ చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

' కొందరు వ్యక్తులు గర్భవతి అయిన ఏనుగుకు పేలుడు పదార్థాలు నింపిన ఫైనాపిల్‌ తినిపించడం వల్ల ఏనుగు మృతి చెందడం తెలిసి నేను షాక్‌కు గురయ్యాను. అమాయక జంతువులపై ఇటువంటి దారుణాలు, సాటి మనుషుల హత్యలకు తేడా లేదు. మరణించిన ఏనుగుకు న్యాయం జరగాలి.' అని రతన్‌ టాటా తనపోస్టు లో పేర్కొన్నారు.Next Story
Share it