గిరిజనుల కోసం కదిలిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

By రాణి  Published on  5 April 2020 12:21 PM GMT
గిరిజనుల కోసం కదిలిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ అవ్వడంతో పట్టణాలు, పల్లెల్లో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాలను, నెలకు సరిపడా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. కానీ అడవిలో, కొండ ప్రాంతాల్లో బ్రతుకుతున్న అడవిబిడ్డలు..అదే గిరిజనుల పరిస్థితి ఏంటి ? లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటి నుంచి వారికి నిత్యావసరాలు కరువయ్యాయి. అడవి తల్లినే నమ్ముకున్న వారికి తినేందుకు కాసిన్ని బియ్యపు గింజలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. అలా కేరళలో ఉన్న గిరిజనుల సమస్యను గుర్తించిన పతనంతిట్ట జిల్లా కలెక్టర్ పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఈ విషయాన్ని చర్చించారు.

Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

గిరిజనులకు నిత్యావసరాలను అందించేందుకు అనువైన మార్గాలకోసం అన్వేషించారు. ఒకే ఒక్క మార్గం కనిపించింది. అడవిలో 12 కిలోమీటర్ల లోపలున్న అవినిప్పర అనే ప్రాంతానికి వెళ్లేందుకు మీనాచిల్ నదిని దాటడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. స్వయంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు నిత్యావసరాలను తీసుకుని గిరిజన కుటుంబాలకు అందజేయాలని సంకల్పించారు. గిరిజనుల ఆకలిని తీర్చడమే ముఖ్యమనుకున్నారు. అందుకోసం కైతాంగు వెల్ఫేర్ స్కీమ్ సహాయాన్ని కోరారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ..అతి తక్కువ మందితో కలిసి సుమారు 3 కిలోమీటర్ల వరకూ..కలెక్టర్ తన భుజాలపైనే సరుకులను మోసుకెళ్లి ఆ గిరిజన కుటుంబాలకు అందజేశారు. ఇలా ప్రజలకోసం పనిచేసే అధికారులుండటం చాలా అరుదు కదా.

Also Read :ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

Next Story