మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

By రాణి  Published on  5 April 2020 11:31 AM GMT
మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

ఢిల్లీలో కరోనా సోకిన గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు తల్లి, బిడ్డలను ఐసోలేషన్ వార్డులోనే ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా..బిడ్డకు జన్మనిచ్చిన మహిళ డాక్టర్ ఎయిమ్స్ లో పనిచేసే ఓ వైద్యుడికి భార్య. ఎయిమ్స్ ఆసుపత్రిలో పని చేసే రెసిడెంట్ డాక్టరుకు కరోనా పాజిటివ్ తేలగా..ఆయన భార్యకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో..వైద్యులు డెలివరీ చేశారు. ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా..దేశంలో కరోనా సోకిన మహిళ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read : ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 3374 మంది కరోనా బారిన పడగా 79 మంది మృతి చెందారు. ఆంధ్రాలో 229 మంది, తెలంగాణలో 270 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 472 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా..12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story