పుట్టిన రోజు నాడు జాదవ్ చేసిన పనికి నెటీజన్లు ఫిదా..!
By తోట వంశీ కుమార్ Published on 26 March 2020 7:38 PM IST�
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ పుట్టిన రోజు నేడు. ఈ రోజు తన బర్త్‌డే వేడుకలను సింపిల్‌గా జరుపుకున్నాడు. తన బర్త్ డే సందర్భంగా చేసిన ఓ మంచి పని నెటీజన్ల మనసును దోచేసింది. పుణె పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చింది. ఈ విషయం ఓ ఎన్టీఓ ద్వారా తెలుసుకున్న కేదార్ జాదవ్ వెంటనే ఆ ఎన్టీఓకి వెళ్లి రక్తదానం చేశాడు.
కేదార్ రక్తదానం చేసిన ఫోటోలను ఆ ఎన్టీఓ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుట్టిన రోజున ఓ నిండు ప్రాణాన్ని కాపాడావని నెటిజన్లు జాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతీ ఒక్కరూ కనీసం వారివారి పుట్టినరోజునైనా రక్త దానం చేయాలని కొందరు నెటీజన్లు కోరారు.
ఇదిలా ఉండగా.. మిడల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన కేదార్ జాదవ్ గాయాల కారణంగా, ఫామ్‌లో లేకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు. బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలర్‌గానూ ఉపయోగపడగలడు.ప్రస్తుతం యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంతో వీరి నుంచి జాదవ్‌కు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాణించి అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని తహతహలాడాడు. మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13వ సీజన్ కరోనా ముప్పుతో ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
�