మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

By సుభాష్  Published on  7 Feb 2020 12:53 PM IST
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ మెట్రో అంచెలంచెలుగా పరుగులుపెడుతోంది. జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మార్గంలో 11 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఈ మెట్రోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌ వద్ద కేసీఆర్‌ మెట్రోరైలును ప్రారంభించనున్నారు. దీంతో గ్రేటర్‌ నగరంలో మొత్తం 69 కిలోమీట మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. బీజేఎస్‌- ఎంజీబీఎస్‌ మార్గం ప్రారంభమైతే పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తన్‌బజార్‌, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లు ఉంటాయి.

ఈ మార్గంలో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కు చేరుకోవడానికి 16 నిమిషాల సమయం పడుతుంది. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎల్బీనగర్‌ -మియాపూర్‌ -నాగోల్‌ -రాయదుర్గం రూట్లలో నిత్యం 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తం మూడు రూట్లలో 16 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని మెట్రో అధికారులు అంచనా వేసినప్పటికీ, ఆ లక్ష్యం చేరుకోలేకపోయారు.

Next Story