జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చునని నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. హైదరాబాద్‌ మినహా అన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానీ పని. హైకోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది. హైకోర్టు చెప్పినట్లు పరీక్షలు నిర్వహిస్తే సాంకేతికంగా అనేక ఇబ్బందులతో పాటు విద్యార్ధులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించింది. అందుకే పదోతరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక దీనిపై రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అనంతరం పదోతరగతి పరీక్షలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. సమాచారం ప్రకారం పరీక్షలు లేకుండా అందరిని పాస్ చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అలా చేస్తే ఏ ప్రాతిపదికన విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వాలి అనే దానిపైనా చర్చించనున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story