కేసీఆర్ ఐలాండ్.. తెలంగాణలో అదెక్కడ ఉందో తెలుసా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Aug 2020 7:38 AM GMTద్వీపం, ద్వీప కల్పాలకు తేడా ఏమిటో చిన్నతనంలోనే సోషల్ క్లాస్ లో చెప్పి ఉంటారు టీచర్లు. చుట్టూ నీరు మధ్యలో భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అని అంటారు కదా.. అచ్చం అలాంటి ద్వీపమే తెలంగాణలో కూడా బాగా ఫేమస్ అవుతోంది. ఆ ద్వీపం పేరు 'కేసీఆర్ ఐలాండ్'..! ఇంతకూ ఈ ఐలాండ్ ఎక్కడ ఉందో తెలుసా..? కరీంనగర్ లో..!
మానేరు నది మధ్యలో మైసమ్మగుట్టపై కేసీఆర్ ఐలాండ్ ను అభివృద్ది చేయనున్నారు. కరీంనగర్‌లోని మానేరు డ్యాంకు అనుకుని ఆధునిక హంగులతో అత్యంత విశాలంగా ఎంట్రెన్స్ లాబీ, పూర్తిగా అద్దాలతో బాంకెట్‌హల్, మెడిటేషన్ హబ్‌తోపాటు ఇండోనేషియా అర్కిటేక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు, 40 మంది విందు చేసుకునేందుకు వీలుగా ప్లోటింగ్ రెస్టారెంట్, 7స్టార్‌కు మించిన సదుపాయాలతో ప్రెసిడెన్సియల్ సూట్, స్మిమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సహజ సిద్ధమైన ప్రాంతం కావడం.. చుట్టూ మంచి నీరు ఉండడంతో మంచి టూరిస్టు ప్రదేశంగా కేసీఆర్ ఐలాండ్ మారనుంది. అర్ధ కిలోమీటర్ పొడవైన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. ఇలాంటి ప్రాంతం వీకెండ్ లను ఎంజాయ్ చేయడానికి, కార్పొరేట్ ఫంక్షన్స్ ను చేసుకోడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తీ చేయడానికి అధికారులు పూనుకున్నారు. కేసీఆర్ ఐలాండ్ ను డెవలప్ చేయడానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు తీసుకుంది.
కరీంనగర్ సిటీ రెనోవేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా కేసీఆర్ ఐలాండ్ రూపు రేఖలు మారుస్తూ ఉన్నారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రాష్ట్రప్రభుత్వం ముందు ఉంచామని.. ఒక్కసారి అప్రూవల్ వస్తే టెండర్లకు ఆహ్వానిస్తామని బీసీ వెల్ఫేర్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ ను టూరిస్ట్ ప్లేస్ గా మార్చడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ ఐలాండ్ అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు అవుతుందని భావిస్తున్నామని అన్నారు. బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్చర్ కంపెనీకి డిజైన్ బాధ్యతలు అప్పగించారు.. వారు పరిశీలించి డిజైన్ ను కూడా ఇచ్చారు.