కర్ణాటకలోని రాయచూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు తెలంగాణ వాసులు దర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాల జిల్లా కేటి దొడ్డికి చెందిన గోపాల్‌ బెంగళూరులో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిగా చేస్తున్నాడు.

లాక్‌డౌన్ కారణంగా బెంగళూరు నుంచి గురువారం ఉదయం కారులో సొంతూరుకు పయనమయ్యాడు. రాయచూర్‌ జిల్లా మాన్వి సమీపంలోకి రాగానే వీరి కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఉద్యోగి గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు అతివేగంగా ఉండట వల్ల అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *