కరీంనగర్‌లో రోడ్‌ టెర్రర్.. ఐదుగురు దుర్మరణం

By అంజి  Published on  9 Feb 2020 12:03 PM IST
కరీంనగర్‌లో రోడ్‌ టెర్రర్.. ఐదుగురు దుర్మరణం

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఎస్‌ వాహనాన్ని అతివేగంతో అదుపు తప్పిన భారీ ట్రక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గంగాధర మండలం కురిక్యాల గ్రామం చోటు చేసుకుంది. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో గ్రానైడ్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో కరీంనగర్‌ నుంచి పూడుర్‌ వెళ్తున్న టాటాఎస్‌ను ఢీకొట్టింది. టాటాఎస్‌లో ఉన్న ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్ధానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కరీనంగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్‌కు చెందిన నర్సయ్య, మేక శేఖర్‌, అంజయ్య, మేక బాబులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో టాటాఎస్‌ వాహనంలో డ్రైవర్‌ మృతదేహం ఇర్కుక్కుపోయింది. దీంతో పోలీసులు అరగంట పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారు అయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story