క్రికెట్ దిగ్గ‌జానికి గుండెపోటు.. ఆందోళనలో అభిమానులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2020 10:02 AM GMT
క్రికెట్ దిగ్గ‌జానికి గుండెపోటు.. ఆందోళనలో అభిమానులు

ఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.తాజా వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కపిల్‌ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు.

ఇదిలావుంటే.. 1959, జనవరి 6న ఛండీగ‌డ్‌లో జన్మించిన కపిల్ దేవ్.. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి.. ప్రపంచంలోని అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకరిగా పేరు సంపాదించాడు. సారథ్యం వహించిన మొద‌టి ప్రపంచకప్ (1983) లోనే భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు క‌పిల్‌. టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు చేసి, 400 వికెట్లు తీసి డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు. క‌పిల్‌ను భార‌త ప్ర‌భుత్వం 1982లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషన్ అవార్డుల‌తో స‌త్క‌రించింది.

Next Story