రిషభ్.. వారిందరికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పు.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Jan 2020 11:51 AM GMTటీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై వస్తున్న విమర్శలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నారు. పంత్ ఆటతీరుపై ఎవరూ విమర్శలు చేసినా అతను తిరిగి వారికి నోటితోనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ విమర్శలకు సమయం దొరికినప్పుడు బ్యాట్‌తోనే బదులిస్తే బాగుంటుందన్నాడు కపిల్.
‘రిషభ్.. నీపై వస్తున్న విమర్శలకు నీవు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి మాటలు కరెక్ట్ కాదని నీ బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వు. విమర్శలు చేసేవారి నోటికి తాళం వేయి. అప్పటివరకూ నిరీక్షించు.. కానీ విమర్శలకు మాత్రం దిగవద్దు అని కపిల్ పేర్కొన్నాడు.
చెన్నైలోని ఓ ప్రొమోషనల్ ఈవెంట్‌కు శనివారం హాజరైన కపిల్.. పంత్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా రిషభ్ దూరం కాగా, ఆ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. రిషభ్ గాయం నుంచి కోలుకున్నా మేనేజ్‌మెంట్ రాహుల్‌నే కీపర్‌గా కొనసాగిస్తోంది. దీనిపై కపిల్ స్పందిస్తూ.. అది తాను డిసైడ్ చేసేది కాదని, ఎవర్నీ ఆడించాలో మేనేజ్‌మెంట్ చూసుకుంటుందని తెలిపాడు.