అందమైన జ్ఞాపకాన్ని షేర్ చేసిన ఫైర్ బ్రాండ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 5:30 AM GMT
అందమైన జ్ఞాపకాన్ని షేర్ చేసిన ఫైర్ బ్రాండ్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పలు విషయాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా షేర్ చేసుకుంటుంది. వివాదాస్పద అంశాలతో పాటు అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలను కూడా ట్విటర్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె కెరీర్ హిట్‌ సినిమా 'తను వెడ్స్ మను రిటర్న్స్' షూటింగ్ సెట్స్‌లో తీసిన ఫొటోను కంగన ట్విటర్‌లో షేర్ చేసింది.ఆ సినిమాలో తను చేసిన 'దత్తు' పాత్రకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.180 డిగ్రీల యాంగిల్‌లో కంగన లెగ్ స్ట్రెచ్‌ చేసినప్పటి ఫొటో అది. ఆ ఫోటోను షేర్ చేసిన కంగన.. దత్తు ఒక గొప్ప పాత్ర అవుతుందని ఎవరు ఊహించారు. ఢిల్లీలో 'తను వెడ్స్ మను రిటర్న్స్' షూటింగ్ సమయంలో తీసిన ఫొటో అది. ఆ సినిమాలో నా లాంగ్ జంప్ సీన్‌కు ముందు నేను పూర్తిగా కాళ్లను స్ట్రెచ్ చేస్తున్నప్పటి ఫొటో అది. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఫొటోలో ఉన్నారు. అందమైన జ్ఞాపకం' అంటూ కంగన కామెంట్ చేసింది.

Next Story