ఈవో సురేష్‌బాబు నియామకం రద్దు చేయండి.. హైకోర్టు ఆదేశాలు..

By అంజి  Published on  26 Jan 2020 7:07 AM GMT
ఈవో సురేష్‌బాబు నియామకం రద్దు చేయండి.. హైకోర్టు ఆదేశాలు..

అమరావతి: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో)కు కోర్టులో చుక్కెదురైంది. ఈవో సురేష్‌బాబు నియామకం చెల్లదని కోర్టు న్యాయమూర్తి తెలిపారు. అడహాక్‌ డిప్యూటీ కమిషనర్‌ హోదాలో ఈవోగా సురేష్‌ బాబు జాయిన్‌ అయ్యారు. ఇంద్రకీలాద్రి ఈవోగా రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ హోదా అధికారిని నియమించాలని కోర్టు పేర్కొంది. గతేడాది ఆగస్టు 21న సురేష్‌బాబును దుర్గగుడి ఈవోగా నియమిస్తూ దేవాదాయశాఖ జీవో 891ను జారీ చేసింది. అయితే సురేష్‌ బాబు నియామకం చెల్లదంటూ జనసేన నాయకుడు మహేష్‌ కోర్టు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఈవో సురేష్‌బాబు నియామకంపై సీరియస్‌ అయ్యింది. సురేష్‌ నియామకం రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం కోర్టుకు చేరిన తర్వాత ఆర్జెసిగా సురేష్‌బాబుకు దేవాదాయశాఖ ప్రమోషన్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఈవో మార్పుపై దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈవోగా సురేష్‌బాబును కొనసాగించేందుకు దేవదాయశాఖమంత్రి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story