'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు' సినిమా విడుదలను ఆపేయండి.!
By Medi SamratPublished on : 22 Nov 2019 3:26 PM IST

ముఖ్యాంశాలు
- ఇంద్రసేన చౌదరి అనే వ్యక్తి సెన్సార్ బోర్డులో పిర్యాదు
- సోమవారం హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేస్తాం
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు' సినిమా విడుదలను ఆపివేయాలని ఇంద్రసేన చౌదరి అనే వ్యక్తి కవాడిగుడాలోని సెన్సార్ బోర్డులో పిర్యాదు చేశారు. ఈ సినిమా రెండు సామాజిక వర్గాలను కించపరిచే విధంగా ఉందని.. గొడవలకు దారితీస్తుందని తక్షణమే సినిమా నిలిపివేయాలని ఇంద్రసేన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమా ఒకరి మద్దతు పొందడానికి మరొకరిని కించపరిచే విధంగా ఉందని.. విడుదలకు అనుమతి ఇవ్వొద్దని ఇంద్ర సేన చౌదరి సెన్సార్ బోర్డును కోరారు. దీనిపై సోమవారం హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఇంద్రసేన చౌదరి తెలిపారు.
Next Story