కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బాన్సువాడ మండలం తాడ్కోల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజారాం దుబ్బలో ఫయాజ్‌ అనే కసాయి తండ్రి ముగ్గురు కూతుళ్లను చెరువులో తోసేసి దారుణంగా హత్య చేశాడు. గురువారం సాయంత్రం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు అఫియా (11), మహీన్‌ (9), జియా (7)లు రాజారాం దుబ్బ చెరువులో శుక్రవారం శవాలై తేలారు. ఈ విషయాన్ని స్థానికులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ముగ్గురి శవాలను బయటకు తీశారు. కుటుంబ కలహాలతోనే ఫయాజ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న ఫయాజ్‌ను అదపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.