లవ్‌స్టోరీ చెప్పిన కాజల్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 7:54 AM GMT
లవ్‌స్టోరీ చెప్పిన కాజల్

సెప్టెంబ‌ర్‌ 30వ తేదీన‌ కాజల్, గౌతమ్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మేగజీన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ తమ లవ్‌స్టోరీ గురించి మాట్లాడింది. పదేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశామ‌ని.. మాది ఏడేళ్ల స్నేహమ‌ని.. మూడేళ్లు డేటింగ్ చేశామ‌ని.. వీలు కుదిరినప్పుడల్లా కలిసేవాళ్లమ‌ని చెప్పుకొచ్చింది.

అయితే లాక్‌డౌన్ సమయంలో పెద్దగా కలవడం కుదరలేదని. మాస్కులు వేసుకుని కిరాణా షాపుల వద్ద కలుసుకునే వాళ్లమ‌ని.. ఒకరి జీవితంలో మరొకరు ఎంత ముఖ్యమనేది అప్పుడే అర్థమైందని తెలిపింది. తన జీవితంలో నాకు ఎంత ప్రాముఖ్యం ఉందనేది గౌతమ్ వివ‌రంగా చెప్పాడని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక్క‌ట‌య్యామ‌ని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో మా పేరెంట్స్‌ను గౌతమ్ కలిశాడు.

జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నాం. కాని కరోనా మా ప్లాన్‌ను తలకిందులు చేసిందని.. పెళ్లి దుస్తుల కోసం కూడా ఎక్కడికీ వెళ్లలేదని. ఆన్‌లైన్‌లోనే దుస్తుల ఎంపిక చేశామని కాజల్ పేర్కొంది. ఇక గౌతమ్ రొమాన్స్ విషయంలో కొంచెం తక్కువని.. ఆ విష‌యంలో గౌతమ్ కంటే నేనే ఎక్కువ రొమాంటిక్ అని పేర్కొంది.

Next Story