ఇంత ఆల్కహాల్ నేనెప్పుడూ తీసుకోలేదు : కాజల్

By రాణి  Published on  12 March 2020 3:39 PM IST
ఇంత ఆల్కహాల్ నేనెప్పుడూ తీసుకోలేదు : కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కరోనా నేపథ్యంలో కాజల్ అగర్వాల్ ఓ సరదా ట్వీట్ చేసింది. ఇంతకుముందెప్పుడూ నేను ఇంత ఆల్కహాల్ తీసుకోలేదు. దీంతో పోలిస్తే నా లివర్ లో ఉండే ఆల్కహాల్ శాతం చాలా తక్కువ కావచ్చు. కరోనా భయంతో మూడ్రోజుల్లో నా చేతులను శుభ్రం చేసేందుకే చాలా ఎక్కువ ఆల్కహాల్ ను వాడాను.

Also Read : విజయ్ ఇంటిపై మరోసారి ఐటీ దాడులు

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చాలామంది ఆల్కహాల్ అధికంగా ఉండే హ్యాండ్ శానిటైజర్స్ ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో చేతులు కడుక్కోవడానికి వినియోగిస్తోన్న ఆల్కహాల్‌ గురించి కాజల్‌ అలా చమత్కరించిందీ చందమామ. ఇప్పుడు ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read : ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాపై సినిమా..

ఓ నెటిజన్ అయితే..కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆల్కహాల్ తో స్నానం చేసినా తప్పులేదన్నట్లే ట్వీట్ చేశాడు. మరొకరు..ఎక్కువగా శానిటైజర్స్ ను వాడటం వల్ల చేతులు పొడిబారడం, పగుళ్లు రావడం వంటి మార్పులుంటాయి కాబట్టి..తగిన మోతాదులో మాత్రమే దానిని వాడటం ఉత్తమం అని సలహా కూడా ఇచ్చారు.



Next Story