తమిళ నటుడు, స్టార్ హీరో విజయ్ ఇంటిపై ఐటీ అధికారులు మరోమారు దాడులు చేశారు. ఈ విషయం ఇప్పుడు తమిళ ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజుల క్రితమే ఆయన ఇంటిపై, అతడికి సంబంధించిన ఆఫీస్ ల పై దాడులు చేశారు. అప్పట్లో విజయ్ ను అరెస్ట్ కూడా చేస్తున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

Also Read : సమీరారెడ్డి ‘ఫ్లిప్ ద స్విచ్’ ఛాలెంజ్‌

ఇప్పుడు మరోసారి విజయ్ ను ఆదాయపు పన్ను అధికారులు టార్గెట్ చేయడం వెనకున్న ఉద్దేశ్యమేమిటోనని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. నిజంగానే విజయ్ ఆదాయపు పన్ను కట్టకపోవడం వల్లే దాడులు చేస్తున్నారా లేక మరేతర కారణాలేమైనా ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మాస్టర్ సినిమాకు సహ నిర్మాతగా పనిచేస్తున్న లలిత్ కుమార్ ఇల్లు, కార్యాలయాల్లో సైతం ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

Also Read : జబర్ధస్త్ షోలో దొరబాబు రీ ఎంట్రీ..! కండిషన్స్‌ అప్లై అన్న హైపర్‌ ఆది..!

ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేస్తున్న విజయ్..త్వరలోనే థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ పాత్ర జేమ్స్ దురైరాజ్ పాత్రలో ఉండబోతుందట. విజయ్ సేతుపతి చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.