సమీరారెడ్డి ‘ఫ్లిప్ ద స్విచ్’ ఛాలెంజ్‌

కథానాయిక సమీరారెడ్డి గుర్తుందా.. అదేనండి ‘జైచిరంజీవా’ సినిమాలో మెగాస్టార్‌తో జోడి కట్టిందిగా.. ఆ సమీరా రెడ్డి. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అమ్మడు. కెరియర్‌ పుల్‌ స్పీడ్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా పెళ్లి చేసేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలు దూరంగా ఉంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలకైతే దూరం అయ్యింది కానీ.. సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది అమ్మడు. తాజాగా ‘ఫ్లిప్‌ ద స్విచ్‌’ ఛాలెంజ్‌ అంటూ ముందుకొచ్చింది.

ఈ ‘ప్లిప్‌ ద స్విచ్‌ ఛాలెంజ్‌’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఎందరో నటీనటులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇప్పుడు సమీరా వంతు వచ్చింది. ఇంతకీ ‘ప్లిప్‌ ద స్వీచ్‌ ఛాలెంజ్‌’ ఎంటనీ అంటారా.. ఈ ఛాలెంజ్ లో ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో ఒకరు డాన్స్ వేస్తూ ఉంటే మరొకరు అందం ముందు కెమెరా పట్టుకుని ఉంటారు. పాట మద్యలో హఠాత్తుగా కెమెరా పట్టుకున్న వారు డాన్స్ చేస్తూ ఉంటారు.. డాన్స్ చేసే వారు కెమెరా పట్టుకుని ఉంటారు. డ్రస్ లు కూడా మారుతాయి. ఇదే ఈ ఛాలెంజ్‌. భలేగా ఉంది కదూ.. సమీరారెడ్డి తన అత్తగారితో కలిసి ఈ ఛాలెంజ్ చేసింది. దీన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. సూపర్‌గా వచ్చిందంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *