ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాపై సినిమా..

By అంజి  Published on  12 March 2020 9:11 AM GMT
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాపై సినిమా..

ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న కరోనా వైరస్‌పై కన్నడ సినీపరిశ్రమ సినిమా తీయాలనుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను కన్నడ చిత్ర నిర్మాత ఉమేషన్‌ భనకర్‌ తెలిపారు. పాన్‌ ఇండియాగా తెరకెక్కించాలనుకుంటున్న ఈ సినిమాకు 'డెడ్లీ కరోనా' అంటూ టైటిల్‌ కూడా రిజిస్టర్‌ చేయించారట. కరోనా వైరస్ వ్యాప్తిలో ఆయన ఓ కథ అంశాన్ని చూశారని తెలిపారు. ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు ఎలా వ్యాపించింది.? ఎక్కడ పుట్టింది, జనాలపై వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపిందన్న అంశాలపై సినిమా చిత్రీకరించనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని ఉమేష్‌ భనకర్‌ తెలిపారు. దర్శకుడు శివ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని కన్నడ సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌పై సినిమా తీసి కొందరు క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

గతంలో తమిళ హీరో సూర్యా నటించిన సెవెన్త్‌ సెన్స్‌ సినిమాలో కూడా ఓ భయంకరమైన గురించి ఉంటుంది. ఆ వైరస్‌ కూడా చైనాలోనే పుడుతుంది. చివరకు ఆ వైరస్‌ను ఎలా జయించారనేది సినిమాలో చూపించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది.

కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. 122 దేశాలకు ఈ వైరస్‌ పాకింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన దంపతులకు, బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రికి వైరస్‌ సోకింది. ఇక‌ మ‌న‌ దేశంలో మొత్తం 73 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో ఇద్దరు కరోనా వైరస్‌ కారణంగా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు.

Next Story