యూరేనియం స్మశానవాటికగా కడప జిల్లా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 1:29 PM IST
యూరేనియం స్మశానవాటికగా కడప జిల్లా..!

కడప జిల్లాలో భారత దేశంలోనే అతి పెద్ద యురేనియం గనులు త్వరలో రాబోతున్నాయి. ఇందులో రోజుకు ఆరు వేల టన్నుల యూరేనియం ఉత్పత్తి అవుతుంది. ఇప్పటివరకూ అత్యధిక పరిమాణంలో యూరేనియం ఉత్పత్తి చేస్తున్న తమ్మల పల్లి మైన్స్ కన్నా ఇది చాలా ఎక్కువ. తుమ్మలపల్లి మైన్స్ , దాని టెయిల్ పాండ్ ల తాలూకు సాటిలైట్ చిత్రాలను చూస్తే రానురాను కడప యూరేనియం స్మశానవాటిక గా మారబోతోందని సులువుగానే అర్థం అవుతుంది.

సాటిలైట్ చిత్రాలను చూస్తే యూరేనియం వ్యర్థాలు ఏడాదికేడాది చేరటం వల్ల టెయిల్ పాండ్ పూర్తిగా నిండిపోయిందన్నది సులువుగా అర్థమైపోతుంది. పైగా యూరేనియం కాలుష్యం ఇరుగు పొరుగు గ్రామాల నీటిని దెబ్బతీయడమే కాక, జీవ జంతువులు, మానవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పంటలను దెబ్బతీస్తున్నాయి.

Kadapa District

కడపలో 2012 నుంచి యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. కడప బేసిన్ లో భారత దేశంలోనే అత్యధిక పరిమాణంలో యూరేనియం లభ్యం అవుతోంది. యూసీఐఎల్ మబ్బు చింతపల్లె, భూమాయిగారి పల్లె, రాచకుంటపల్లె, వేల్పుల గ్రామాలలో భూములను సేకరించి టెయిలింగ్ పాండ్ ను నిర్మించింది. ఇది యూనిట్ కి ఆరు కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామాలన్నీ తీవ్రంగా యూరేనియం కాలుష్యం వల్ల ప్రభావితమయ్యాయి. అలాగే మైన్ కు కేవలం రెండున్నర కిమీ దూరంలో ఉన్న మబ్బు చింత పల్లె అత్యధిక ప్రభావితం అయింది.

Kadapa District

తుమ్మల పల్లిలో రోజూ 1305 గ్రాముల యూరేనియం ఉత్పత్తి అవుతుంది. మిగతాది వ్యర్థంగా మారిపోతుంది. దీనిని టెయిలింగ్ పాండ్ లోకి విడుదల చేస్తారు. ఈ పాండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మితమైందని అధికారులు చెబుతున్నా నిపుణులు మాత్రం దీనితోవిబేదిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఈ పాండ్ కు బెంటొనైట్ క్లే తాపడం చేయాలి. పాలిథీన్ కవర్లను ఉపయోగించాలి. లేకపోతే భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది. కానీ అధికారులు మాత్రం సమీపంలోని చెరువుల్లో నీరు ఉప్పగా మారడానికి యూరేనియం కాలుష్యానికి సంబంధం లేదని వాదిస్తున్నారు.

అయితే ఐఐసీటీలో పనిచేసి రిటైరైన డా. కే బాబూరావు అసలు ఈ ప్రదేశం టెయిలింగ్ పాండ్ నిర్మాణానికి అనుకూలం కానే కాదని వాదిస్తున్నారు. ఎత్తుపల్లాలున్న చోట టెయలింగ్ పాండ్ ఏర్పాటు చేయకూడదని ఆయన అంటున్నారు. ఇక్కడ బెంటోనైట్ లైనింగ్ లేదని, కాబట్టి నీరు నేలలోకి ఇంకి, కాలుష్యం పెరుగుతుందని ఆయన అంటున్నారు. తుమ్మలపల్లి టెయిలింగ్ పాండ్ లో నీరు నేలలోకి ఇంకిపోయి, చిన్న చిన్న టెయిల్ పాండ్స్ తయారవుతున్నాయని ఆయన వాదిస్తున్నారు.

Kadapa District

మనదేశంలో యూరేనియం టెయిల్ పాండ్స్ నిర్మించే నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్లు లేరు. ఇలాంటి వారు లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రధానంగా ఉన్నారు. “ముందు భూగర్భ జలాలు ప్రభావితమైపోతాయి. ఈ పాత గని రోజుకు 18000 క్యూబిక్ మీటర్ల నీటిని పీల్చుకుంటుంది. కొత్త గని దీనికి రెండింతలు ఉంది. దీని కోసం కూడా భూగర్భ జలాలు తప్ప ఉపయోగించేందుకు వేరే జలవనరులు లేవు. ప్రభుత్వం ప్రజా అవసరాలకన్నా పరిశ్రమల అవసరాలకే పెద్ద పీట వేసింది. నెమ్మది నెమ్మదిగా పొలాలకు నీరందించే జలాశయాలు ఇంకిపోతాయి. ఈ నీరే ఇక్కడి వారికి సాగునీరు, తాగునీరు కూడా. ఇకపై ఈ భూమి నివాసయోగ్యంగా ఉండదు. “ అంటారు బాబూరావు.

Kadapa District

కడపలో భూగర్భ జలాలే ప్రజలకు ప్రధాన జలవనరు. ఈ గని పరిసర ప్రాంతాల్లో ప్రజలకు చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. ఇక్కడి జీవ జంతు జాలం బలహీనపడిపోతోందని ఆయన అన్నారు. మన దేశంలో మైనింగ్ వ్యర్థాల విసర్జన విషయంలో ఎలాంటి నియమాలూ లేవు. ప్రభుత్వం కడపలో ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదు. ప్రజారోగ్యం పాడైపోవడం పై ఎలాంటి చింతా లేదు. ఇక కడప ప్రజలకు మరణమృదంగమే వినిపిస్తుందనడంలో సందేహం లేదు,” అంటారు బాబూరావు. రానున్న రోజుల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లు కూడా నిరర్థకమైపోతాయి. ఆర్వో ప్లాంట్ల నీరు తాగడానికి వీలుంటుందో లేదో పరిశీలించే వ్యవస్థ కూడా లేదని ఆయన అన్నారు.

అయితే యూసీఐఎల్ సీ ఎండీ సీ కే అస్నానీ మాత్రం మైనింగ్ ఉన్న చోట వివాదాలు ఉండటం తప్పనిసరి అని, అయితే ఈ గని వల్ల జల కాలుష్యం లేదని, భవిష్యత్తు లో కొత్త గని వచ్చినా సమస్యలు ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు ప్రభావితం కావని, కొత్త ప్రాజెక్టుకు కొత్త టెయిలింగ్ పాండ్ ఏర్పాటు చేస్తామని ఆయ

Next Story