కరోనా సోకిందని.. ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్‌ నేత..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2020 6:26 AM GMT
కరోనా సోకిందని.. ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్‌ నేత..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ వ్యాప్తి ఆగడం లేదు. చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికి ఈ మహమ్మారి సోకుతోంది. తాజాగా కడప జిల్లాలో విషాదం ఘటన చేసుకుంది. కరోనా సోకిందని కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి(55) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న శిరిగిరెడ్డి గంగిరెడ్డికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆదివారం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

రెండు రోజుల క్రితం కిందకి వెళ్లి వస్తానని చెప్పిన కాంగ్రెస్‌ నేత తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గంగిరెడ్డి సెల్‌ సిగ్నల్స్ ఆధారంగా ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె రైల్వే ట్రాక్‌కు వెళ్లిచూడగా.. ఆయన విగతజీవిగా కనిపించారు. కరోనా సోకిందన్న భయంతోనే కాంగ్రెస్ నేత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Next Story