రక్షణ పాఠాలు నేర్పాల్సిన వాడే..లైంగిక వేధింపులకు పాల్పడితే..
By రాణి Published on 12 March 2020 1:25 PM ISTఆడపిల్లలపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు వారి తల్లిదండ్రులు అమ్మాయిల్లో ఆత్మరక్షణను పెంపొందించాలి. కొందరు మాటల ద్వారా ధైర్యాన్నిస్తే..మరికొందరు రకరకాల కోచింగ్ లు ఇప్పిస్తుంటారు. వాటిలో ఒకటి..కరాటే. మగువ తనను తాను ఆపద సమయంలో రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందీ కరాటే. కానీ..బాలికలకు కరాటే పాఠాలు నేర్పాల్సిన కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడితే..ఇక ఆ అమ్మాయిలను రక్షించేదెవరు ? వాళ్ల పరిస్థితి ఏంటి ?
Also Read : గుడి ఎనక సామి..నగ్నపూజలు
ఉత్తర్ ప్రదేశ్ షాహబాద్ సిటీలోని ఒక స్కూల్ లో 27 ఏళ్ల గుర్మైల్ సింగ్ జూడో కోచ్ గా పనిచేస్తున్నాడు. అతను 5-12 తరగతుల బాలికలకు జూడో విద్య నేర్పిస్తుంటాడు. కాగా..కరాటే నేర్చుకునేందుకు తన వద్దకు వచ్చే బాలికలపై గుర్మైల్ సింగ్ కన్నుపడింది. తరచూ ఆ బాలికల సెల్ఫోన్లకు అసభ్యకరమైన వీడియోలు పంపిస్తూ..లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వెలుగులోకొచ్చింది. సంవత్సరం నుంచి ఓ బాలికపై అత్యాచారం చేస్తున్నట్లు కూడా తెలిసింది. అంతేకాక మరో ఐదుగురు బాలికలను కూడా తన కామవాంఛ తీర్చాలని వేధిస్తున్నాడట. ఇదంతా ఆ బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. గుర్మైర్ సింగ్ తమను పదే పదే వేధిస్తున్నాడనీ..తాను చెప్పినట్లుగా వినకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పారు బాధిత బాలికలు.
Also Read : వివాహితతో సంబంధం.. చివరకు కత్తితో మర్మాంగం కోసి..
స్కూల్లో బాలికలకు సంబంధించిన ఫోన్ నంబర్లు తీసుకుని..వాట్సాప్ గ్రూప్ తయారు చేసి వాటిలో అశ్లీల చిత్రాలు..వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధించాడని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు గుర్మైల్ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 67, ఐటీ, 120 బి, 384, 452, పోస్కో, 506 చట్టాల కింద కేసు నమోదు చేశారు.
బాలికలిచ్చిన స్టేట్ మెంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..అదంతా నిజమేనని తేలింది. వెంటనే ఆ కామ జూడో కోచ్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అతడి ఫోన్ ను పరిశీలించిన పోలీసులు..అందులో ఉన్న ఫొటోలు, వీడియోలను చూసి షాక్ అయ్యారు.