ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్న యువకుడు.. చివరికి దారుణ హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో కనిపించిన అతని మృతదేహాం పూర్తిగా కత్తులతో అతి దారుణం నరికబడి ఉంది. ఈ ఘటన రాజస్తాన్‌ రాష్ట్రంలోని జల్వార్‌ జిల్లా డాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాగ్‌ పీఎస్‌ పరిధిలోని చాన్‌ గ్రామ శివారులో స్థానికుల ఓ యువకుడి మృతదేహం కనిపించింది. యువకుడిని భయంకరంగా హతమార్చినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే అలర్ట్‌ అయిన డిప్యూటీ ఎస్పీ రాజ్‌గోపాల్‌ సింగ్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన జలీమ్‌ సింగ్‌గా గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రి తరలించారు. కాగా మృతదేహనికి పోస్టుమార్టం చేసిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అతడిని అత్యంత పాశవికంగా చంపారని, తీవ్రంగా కొట్టి హత్య చేశారని రిపోర్టులో వైద్యులు తెలిపారు.

అంతటితో ఆగకుండా మర్మాంగాన్ని కోసి చిత్ర హింసలు పెట్టి చంపినట్లు తేలింది. దీంతో నిందితుల కోసం పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. చాన్‌ గ్రామంలో జలీమ్‌సింగ్‌.. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అదే గ్రామానికి చెందిన రామ్‌లాల్‌, స్మార్ట్‌ సింగ్‌, సింగ్‌, నారాయణ్‌ అనే నలుగురు నిందితులు.. జలీమ్‌సింగ్‌ను చంపినట్లు నిర్దారించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

ఇలాంటి వివాహేతర సంబంధాలు చాలా మంది ప్రాణాలను బలికోరుతున్నాయి. తాత్కాలిక ఆకర్షణలో పడి కొందరు.. తమ భర్తలు లేదా భార్యలను మోసం చేస్తున్నారు. చివరకు నిజం బయటకు పొక్కుతుండడంతో ఎదుటి వారి ప్రాణాలను తీసి హంతకులుగా మారుతున్నారు. తాత్కాలిక సుఖం కోసం ఆనందపడి.. చివరికి ప్రాణాలను వదులుతున్నారు. ప్రస్తుత సమాజంలో చాలా మంది తమ జీవిత భాగస్వాములను కాదని.. వివాహేతర సంబంధాలకు తెరలేపుతున్నారు. చివరకు తేడాలు వచ్చి ప్రాణాలను తీసుకుంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.