బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

By సుభాష్  Published on  21 Dec 2019 8:13 AM GMT
బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు

ముఖ్యాంశాలు

  • ఇద్దరు దోషులుగా తేలుస్తూ జీవిత ఖైదు
  • యూపీ వరుస పేలుళ్లపై కోర్టు తీర్పు
  • 12ఏళ్లకు కోర్టు జడ్జిమెంట్‌

2007లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్ట్రంలోని ఫైజాబాద్, లక్నో, వరణాసి నగరాల్లో వరుస పేలుళ్ల జరిగాయి. ఈ కేసులో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2007, నవంబర్‌ 23న ఉగ్రవాదులు ఫైజాబాద్, లక్నో, వరణాసి నగరాల్లో ఉగ్రవాదులు ముహమ్మద్ తారిఖ్, ముహమ్మద్ అఖ్తర్ లు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

ఈ పేలుళ్లు జరిగిన తర్వాత 12 ఏళ్లకు కోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా జడ్జి అశోక్ కుమార్ ఈ తీర్పునిస్తూ, ఇద్దరు దోషులకు జీవిత ఖైదుతో పాటు రూ.50వేల జరిమానా చెల్లించాలని వెల్లడించారు. కాగా, ఈ పేలుళ్లలో పాల్గొన్న మూడో నిందితుడు సజ్జాద్ రెహమాన్ పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేశారు. ఈ కేసుపై కోర్టు సరైన తీర్పు ఇచ్చిందని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ బహదూర్ సింగ్ పేర్కొన్నారు. ఈ వరుస బాంబు పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, మరో 26 మంది గాయపడ్డారు.

Next Story