జైపూర్‌లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్..!
By అంజి Published on 18 Dec 2019 2:38 PM IST
రాజస్థాన్: జైపూర్ బాంబ్‌బ్లాస్ట్ కేసులో దోషులు ఖరారు అయ్యారు. బుధవారం సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లో నలుగురిని దోషులుగా తేల్చిన జైపూర్ కోర్టు ఒకరిని నిర్దోశిగా ప్రకటించింది. 2008 మే 13లో జరిగిన ఈ ఘటనలో దాదాపు 80 మంది మృతి చెందగా, 185 మంది గాయపడ్డారు. ఎనిమది బాంబులు సీరియల్ పేల్చి జైపూర్ వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. నలుగురు నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫూర్ రెహ్మాన్, సల్మాన్‌ను దోషులుగా జైపూర్ కోర్టు నిర్దారించింది. షాబాజ్ హుస్సేన్‌కు బాంబ్ బ్లాస్ కేసుతో సంబంధం లేదని తెలిపింది.
Also Read
హెల్మెట్ ధరించినా తప్పని మృత్యువుNext Story