జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ప్రత్యేకత.. నవరాత్రుల్లో ప్రత్యేక ఉత్సవాలు
By సుభాష్ Published on 24 Oct 2020 6:59 AM GMTహైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఉంది. హైదరాబాద్‌లోని అతి పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. జంటనగరాలలో అతిపురాతనమైన ఆలయంగా పిలవబడుతున్నది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ప్రధాన రహదారికి సమీపంలో శ్రీపెద్దమ్మ దేవాలయం ఉంది. జూబ్లీహిల్స్ లో వెలసియున్న శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దేవాలయమని పూర్వీకుల అభిప్రాయం. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయమున్నట్లు పూర్వీకుల ద్వారా సమాచారం.
పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాతంలో ఉండగా, 2000 సంవత్సరం నుండి ఈ ఆలయానికి ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా వుండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. గ్రామ దేవతగా వున్న అమ్మవారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో, సహజంగానే పల్లెవాసాలు అదృశ్య మయ్యాయి. గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకుంటోంది. ఆలయంలోకి ప్రవేశించటానికి ప్రవేశద్వారం మీద దేవతామూర్తులు మనకు స్వాగతం చెబుతునట్లుగా కనబడుతుంది. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని మూలగుడి అని అంటారు. పీఠాధిపతులచే నూతన విగ్రప్రతిష్ఠాపన 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రప్రతిష్ఠాపన జరిగిన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయిబిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి గుడి ముందు ఉన్న ద్వజస్తంభానికి ఇరువైపులా పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు. అమ్మవారి గర్భాలయం వెనుకవైపున నవదుర్గల ఆలయం ఉంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిదాత్రి అమ్మవార్లు ఉన్నారు. గర్భాలయంలో పెద్ధమ్మతల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో గర్భాలయంలో పెద్ధమ్మతల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం, త్రిశూలం, కుంకుమ భరిణ, చక్ర, ఖడ్గంతో దర్శనమిస్తుంది. అమ్మవారు నవరత్న ఖచిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడ ఇక్కడ ఉన్నారు. ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యఅభిషేకాలు , ప్రత్యేక అభిషేకములు జరుగుతాయి.
పీజేఆర్ చొరవతో..
కాంగ్రెస్ దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డికి అమ్మవారంటే మహా భక్తి. తల్లి ప్రేరణతో ఆయన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. 1993లో ప్రారంభమైన నిర్మాణం ఏడాదికల్లా పూర్తయింది. హంపీ విరూపాక్ష స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నిజానికి, ప్రభుత్వం అప్పట్లో ఇక్కడ ఉన్నతాధికారుల నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. పీజేఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పట్టుబట్టి .. అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు.
ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలు
ఆషాడ శుద్ద సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు, దసరా రోజులలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలు, శివారు ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తుంటారు.
నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహరీగోడ ఉండి, నగరం నుండి బయటకు వెళ్లుటకు 14 ద్వారములు ఉండేవి. వాటిలో చారిత్రాత్మకమైన గౌలిపుర ద్వారము ఒకటి. ఈ ద్వారం ముందు ఏనాడో వెలసిన మహంకాళి మాతేశ్వరి అమ్మవారు, నాటి నుండి నేటి వరకు నిత్య, ధూప, దీప నైవేద్యా లు అందుకొనుచు, కొలిచే వారికి కొంగు బంగా రమై కోరికలు తీర్చే చల్లని తల్లిగా, విరాజిల్లు తోంది. ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలవంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంటుగా చేస్తుంటారు.