బ్రేకింగ్: వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య

By సుభాష్  Published on  2 March 2020 4:37 PM GMT
బ్రేకింగ్: వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య

వరంగల్‌లో ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌, ప్రెస్‌ క్లబ్‌ కోశాధికారి బొమ్మినేని సునీల్‌ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో కొద్దిసేపటి క్రితమే ఓ బేకరీ ముందు ఈ దారుణం చోటు చేసుకుంది. అతనితో పాటు దేవేందర్‌ రెడ్డి అనే వ్యక్తిపై కూడా దుండగులు దాడికి తెగబడ్డారు. కాగా, స్నేహితులకు రావాల్సిన డబ్బుల కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కొద్దిసేపటికి సునీల్‌ హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it