నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఆల్‌ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ)కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By అంజి  Published on  14 Feb 2024 4:51 PM IST
UPSC, Civil Services, Notification , IAS, IPS, Central Govt

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

సివిల్‌ సర్వీసుల్లో జాబ్‌ సాధించాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌. ఆల్‌ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ)కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ప్రిలిమినరీ పరీక్ష మే 26, మెయిన్స్‌ సెప్టెంబర్‌ 20న జరగనుంది. కాగా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసులో 150 పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఇవాళ మధ్యాహ్నం అప్‌లోడ్ చేశారు. ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచే మొదలైంది.

మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరణ జరగనుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 21 - 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. సివిల్స్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 26న ప్రిలిమినరీ జరగనుండగా.. ఈ పరీక్షకు 3 వారాల ముందు అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తారు.

Next Story