యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2022 ఫైనల్ ఫలితాలు విడుదల

UPSC Civil Services Final Result 2022 announced. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి.

By Medi Samrat  Published on  23 May 2023 4:17 PM IST
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్-2022 ఫైనల్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫైనల్ ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. సివిల్స్ 2022 లో మొత్తం 933 మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోస్ట్ లకు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ 933 మందిలో జనరల్ కేటగిరీలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 99 మంది, ఓబీసీ కేటగిరీలో 263 మంది, ఎస్సీ కేటగిరీలో 154, ఎస్టీ కేటగిరిలో 72 మంది ఎంపికయ్యారు. ఈ పరీక్ష ద్వారా 180 మందిని ఐఏఎస్ కు, 200 మందిని ఐపీఎస్ కు, 38 మందిని ఐఎఫ్ఎస్ కు, 473 మందిని గ్రూప్ ఏ కేంద్ర సర్వీసులకు, 131 మందిని గ్రూప్ బీ సర్వీసులకు ఎంపిక అయ్యారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం ఈ యూపీపీఎస్సీ సివిల్స్ 2022 ప్రత్యేకత. తొలి ర్యాంక్ ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్ ను గరిమా లోహియా, మూడో ర్యాంక్ ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్ ను స్మృతి మిశ్రా సాధించారు.


Next Story