TSPSC : ఏఈఈ రీ షెడ్యూల్ పరీక్ష తేదీలు ఇవే

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పరీక్షను రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2023 4:31 AM GMT
TSPSC, AEE exam

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(TSPSC) పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప‌శ్న‌ప్ర‌తాలు లీక్ కావ‌డంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌గా ప‌లు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను జూన్ 11న నిర్వ‌హిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే.. ఏఈఈ ప‌రీక్ష‌ను ఎప్పుడు నిర్వ‌హించేది వెల్ల‌డించ‌లేదు.

తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పరీక్షను టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఈఈ పరీక్షలను దిగువ పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెప్టెంబరు 3, 2022న నోటిఫికేషన్ నంబర్ 12/2022 ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల కోసం పరీక్షను తిరిగి నిర్వహించాలని TSPSC నిర్ణయించింది.

మే 8న ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష, మే 9న అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మే 21న సివిల్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి.


పై పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పైన పేర్కొన్న పరీక్ష తేదీలను గమనించి, పరీక్ష తేదీలకు ఒక వారం ముందు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. TSPSC పరీక్షా సరళి మరియు సిలబస్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. దీనిని అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రారంభించాలని కమిషన్ కోరింది. ఏఈఈ పరీక్ష రద్దు తర్వాత రీషెడ్యూల్ అవుతుందని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ ప్రకటన ఉపశమనం కలిగించింది.

Next Story