ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పలు పరీక్షలను రద్దు చేయగా కొన్నింటిని వాయిదా వేసింది. అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన కమిషన్ జూన్ 11 నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలు సహా రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షలను మే నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. గురువారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిషన్ భేటీ జరిగింది. పరీక్షల తేదీల ప్రకటన, నిర్వహణ, సీబీటీ విధానం తదితర అంశాల గురించి చర్చించారు. అయితే.. పరీక్షల తేదీపై స్పష్టత రాలేదు.
"పరీక్ష తేదీలు, పూల్ ఫ్రూఫ్ పద్దతిలో ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. శుక్రవారం తేదీలు ఖరారు కానున్నాయి. తాత్కాలికంగా.. పరీక్షలు మేనెలలో ప్రారంభంమవుతాయి." అని వర్గాలు తెలిపాయి.
ప్రశ్నాపత్రం లీక్ కావడంతో టీఎస్‌పీఎస్‌సీ ఇంతకుముందు AEE, AE, గ్రూప్-I ప్రిలిమినరీ పరీక్షలకు నిర్వహించిన పరీక్షలను రద్దు చేసింది. TPBOలు మరియు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.