నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 1540 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

TSPSC notifies 1540 AEE job vacancies.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2022 2:27 AM GMT
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 1540 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఏఈఈ ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ విభాగాల్లో 1540 పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ నెల 22 నుంచి అక్టోబ‌ర్‌14 వ‌ర‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని వెల్ల‌డించింది.

ఖాళీల వివ‌రాలు ఇవే..

అసిట్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్(మిషన్ భగీరథ) లో 302 పోస్టులు, ఏఈఈ సివిల్ విభాగంలో 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147, టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్ లో 15, ఇక ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్ట్ మెంట్ లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 , ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 ఐ అండ్ సీడీ డిపార్ట్ మెంట్లో 704 ఖాళీలు ఉన్నాయి. దీనిలో సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100 పోస్టులను కేటాయించారు. మొత్తం 1540 పోస్టులకు సంబంధించి ఖాళీలను గుర్తించారు.

ఏఎంవీఐ నోటిఫికేషన్‌ రద్దు

తెలంగాణ ర‌వాణా శాఖ‌లో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఈ విష‌యాన్ని టీఎస్‌పీఎస్‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. జూలై 27న‌ 113 ఏఎంవీ పోస్టు భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు వ్య‌క్తం కావ‌డం, అర్హ‌త‌ల విష‌యంలోనూ అభ్య‌ర్థుల నుంచి విజ్ఞ‌ప్తులు రావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. వాటిని రవాణా శాఖకు తెలియజేసినట్లు చెప్పింది.

Next Story