తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రవాణా శాఖ పరిధిలో మొత్తం 113 ఏఎంవీఐ ఉద్యోగాలను భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నోటిఫికేషన్ ఇచ్చింది. మల్టీ జోన్ల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్-I లో 54 ఖాళీలు, మల్టీ జోన్-II లో 59 ఖాళీలు ఉన్నాయి. ఆగస్ట్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల అర్హతలు, ఇతర అంశాలు, నోటిఫికేషన్ పూర్తి వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ www.tspsc.gov.in లో పొందవచ్చు.
ముఖ్య విషయాలు..
- ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేవారు మెకానికల్ ఇంజినీరింగ్ / ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ / డిప్లోమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్)లో ఉత్తర్ణీత సాధించి ఉండాలి. వీటితో పాటు వాలీడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 21- 39 మధ్య ఉండాలి.
- రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
-ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు చెల్లిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ చూడండి..