నిరుద్యోగులకు శుభవార్త.. 207 పోస్టులకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
TSPSC issues recruitment notifications for 207 posts in different departments.రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2022 2:46 AM GMTతెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) శుభవార్త చెప్పింది. తాజాగా మరో 207 పోస్టుల భర్తీకి రెండు వేరు వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో వెటర్నరీ డిపార్టుమెంట్‌లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ A, B) పోస్టులు కాగా మిగిలిన 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 3 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఖరి నిమిషం వేచి ఉండకుండా ప్రారంభ తేదీ నుంచే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో తేదీలను పొడిగించేది లేదని చెప్పింది. విద్యార్హతలు, జోన్ల వారీగా పోస్టుల వివరాలు ఇంకా మరిన్ని వివరాల కోసం https://www. tspsc. gov.inలో చూడొచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. వ్యవసాయ, కో ఆపరేటివ్ విభాగంలో 801 పోస్టులు, పశుపోషణ, మత్స్య విభాగంలో 353 పోస్టులు ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన ఖాళీలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం ఈ విభాగాల్లో రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.