లక్షకు పైగా జీతం.. ఉద్యోగాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

TSPSC Horticulture Officer Recruitment 2022-23. తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియను ప్రారంభించింది.

By M.S.R
Published on : 24 Dec 2022 3:44 PM IST

లక్షకు పైగా జీతం.. ఉద్యోగాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. హార్టికల్చర్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు నెలకు రూ.లక్షకు పైగా జీతం సంపాదించవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో వచ్చే నెల 3 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు తుది గడువు జనవరి 24 తో ముగుస్తుంది. మొత్తం ఖాళీలు 22 ఉన్నాయి.

హార్టికల్చర్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. 01-07-2022 నాటికి వయసు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి పే స్కేలు రూ.51,320 నుంచి 1,27,310 గా ఉండనుంది. పరీక్షను 04-04-02023న నిర్వహిస్తారు.


Next Story