గ్రూప్‌-4 కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌

TSPSC Group 4 Exam will be held on July 1. గ్రూప్‌-4 కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌ ప‌రీక్ష తేదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2023 4:44 AM GMT
గ్రూప్‌-4 కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్ర‌స్తుతం పుస్తకాల‌తో కుస్తీ ప‌డుతున్నారు. పెద్ద సంఖ్య‌లో నోటిఫికేష‌న్లు విడుద‌ల కావ‌డ‌మే అందుకు కార‌ణం. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-4 కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌. ప‌రీక్ష తేదీ వ‌చ్చేసింది. జూలై 1న గ్రూప్ 4 పరీక్ష‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌( టీఎస్‌పీఎస్‌సీ) తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షఉండ‌నుంది.

రెండు పేపర్లలోనూ 150 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కొ మార్కు చొప్పున రెండు పేపర్లూ కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్ష ఓఎంఆర్‌ బేస్డ్‌గా ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది.

గ్రూప్‌–4 కేటగి­రీలో మొత్తం 8,180 ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు. పెద్ద సంఖ్య‌లో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేస్తుండ‌డంతో ధ‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు. నేటి సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ గ‌డువు ముగియ‌నుంది. మ‌ళ్లీ పొడిగించే అవ‌కాశం లేదు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు 9ల‌క్ష‌ల మంది పైగా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

గ్రూప్ -4 నోటిఫికేష‌న్‌లో భాగంగా 8,180ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 429 జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియ‌ర్ ఆడిట‌ర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు ఉన్నాయి.

జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు (429) : ఆర్థిక శాఖ‌లో 191, పుర‌పాల‌శాఖ‌లో 238 పోస్టులు ఉన్నాయి.

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు(6,859).. వ్య‌వ‌సాయ‌శాఖ‌లో 44, బీసీ సంక్షేమ‌శాఖ‌లో 307, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌లో 72, అట‌వీశాఖ‌లో 23, ఆర్థిక‌శాక‌లో 46, వైద్య‌-ఆరోగ్య‌శాఖ‌లో 338, ఉన్న‌త విద్యాశాఖ‌లో 742 పోస్టులు ఉన్నాయి. హోంశాఖ‌లో 133, నీటిపారుద‌ల శాఖ‌లో 51, కార్మిక‌శాఖ‌లో 128, మైనార్టీ సంక్షేమ‌శాఖ‌లో 191, పుర‌పాల‌క శాఖ‌లో 601, పంచాయ‌తీరాజ్ శాఖ‌లో 1245, రెవ్యెన్యూ శాఖ‌లో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖ‌లో 474, సెకండ‌రీ విద్యాశాఖ‌లో 97, ర‌వాణాశాఖ‌లో 20, గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌లో 221, మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ‌లో 18, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ‌లో 13 పోస్టులు ఉన్నాయి.


Next Story