నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

TSPSC Group 2 Notification 2022 released.గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Dec 2022 3:42 AM GMT
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాత‌ర కొన‌సాగుతోంది. నిరుద్యోగులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. 18 ప్ర‌భుత్వ విభాగాల ప‌రిధిలోని 783 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో అత్య‌ధికంగా సాధారణ పరిపాలన విభాగంలో 165 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(ఏఎస్‌వో) పోస్టులు ఉన్నాయి. ఆ త‌రువాత‌ 126 ఎంపీడీవో, 95 నాయబ్‌ తహసీల్దార్ లు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు జ‌న‌వ‌రి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 16 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల కోసం అభ్య‌ర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

పోస్టుల వివ‌రాలు ఇవే..

సాధార‌ణ ప‌రిపాల‌న ఏఎస్‌వో - 165

మండ‌ల పంచాయ‌తీ అధికారి - 126

నాయ‌బ్ త‌హ‌సీల్దార్ - 98

ప్రొబేష‌న్ ఎక్సైజ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ - 97

స‌హ‌కార‌శాఖ స‌హాయ రిజిస్ట్రార్ - 63

స‌హాయ వాణిజ్య ప‌న్నుల అధికారి - 59

స‌హాయ అభివృద్ది అధికారి (జౌళి) - 38

ఆర్థిక శాఖ ఏఎస్‌వో - 25

స‌హాయ బీసీ సంక్షేమాధికారి - 17

స‌హాయ సాంఘిక సంక్షేమాధికారి -17

శాస‌న‌స‌భ స‌చివాల‌య ఏఎస్‌వో -15

స‌బ్ రిజిస్ట్రార్ గ్రేడ్‌-2 - 14

మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గ్రేడ్‌-3 - 11

జిల్లా ప్రొబేష‌న్ అధికారి గ్రేడ్‌-2(జువైన‌ల్‌) - 11

స‌హాయ గిరిజ‌న సంక్షేమాధికారి - 9

స‌హాయ కార్మిక అధికారి -9

న్యాయ‌శాఖ ఏఎస్‌వో - 7

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏఎస్‌వో -2

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని మాట ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకు అనుగుణంగా వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల అవుతున్నాయి. ఇప్ప‌టికే గ్రూప్‌-1, గ్రూప్‌-4, పోలీస్, అసిస్టెంట్ ఇంజినీర్‌ల‌తో పాటు ప‌లు విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

Next Story